Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

100 శాతం టీడీపీ నే అధికారం లో కి వస్తుంది , మోడీ పై ఫైర్ అయిన చంద్రబాబు

Category : national state politics

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల రిజల్ట్స్ కోసం అన్ని పార్టీ లు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి ,ఇదిలా ఉండగా మే 23న ఏపీలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు అధినేత చంద్రబాబు. 100 శాతం కాదు.. 1000 శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా వుండాలని నేతలకు దిశా నిర్ధేశం చేశారు ,టీడీపీ ని గెలిపించాలనే ఉద్దేశ్యం తో క్యూ లో నిలబడి ఓట్లు వేసిన ప్రజలకు చెప్పాలని సూచించారు. సోమవారం అమరావతిలో ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు సమావేశమయ్యాని రు. ఎన్నికల సరళి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇంతకు ముందెప్పుడూ ఖర్చు ఎలాంటి నీచమైన ఎన్నికలు ఎక్కడా జరగలేదని డబ్బులను విపరీతంగా ఖర్చు చేసారని అన్నారు ,ఇలాచేయడం వాళ్ళ ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు ,ఎవరు ఎన్ని చేసిన తెలుగుదేశం పార్టీ నే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు ,టీడీపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు.. ప్రజాసమస్యలపై స్పందించాలని దిశా నిర్దేశం చేశారు. క్యాంప్‌ ఆఫీసులో ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌ పెట్టుకోవద్దా అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రధాని మోదీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఒక నిరంతర ప్రక్రియని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.

క్యాంప్‌ ఆఫీసులో సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టుకోవద్దా అని ప్రశ్నించిన బాబు.. ప్రధాని మోడీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా అని నిలదీశారు. కేంద్రం ఏపీలో ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోందని.. తెలంగాణలో ఒక్కరిపైనా ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరగలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ మోదీ భ్రష్టుపట్టించారు. సీబీఐ, ఐటీ, ఈడీ, ఈసీ దారుణంగా వ్యవహరించాయని మండిపడ్డారు. టీడీపీ పోరాటం వల్లే వీవీ ప్యాట్లు వచ్చాయి.. ఆఫీసర్లకు ట్రైనింగ్‌ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీకి 160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదంటున్నారు.

Related News