//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒకరికి కేసుల భయం ..ఇంకొకరికి నల్లధనం భయం : చంద్రబాబు ....!

Category : politics

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ , ప్రతిపక్ష నేత జగన్ పై సీఎం Chandrababu మండిపడ్డారు. పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, రాజకీయం అంటే సినిమా స్క్రిప్ట్ కాదన్నారు. పవన్, జగన్‌కు మోదీ అంటే భయమని, అందుకే బీజేపీని విమర్శించరని అని చెప్పుకొచ్చాడు . ఒకరికి కేసుల భయం, మరొకరికి నల్లధనం భయమని జగన్ , పవన్ ని ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీ ఎక్కడ జైల్లో పెడతారో అని జగన్‌, పవన్‌ భయపడుతున్నారని విమర్శించారు.

అవినీతికి పాల్పడే వారే కేసులకు భయపడతారని, తనకు భయం లేదని Chandrababu స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా చేస్తామని తెలిపారు. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలా రాజధాని నిర్మాణం చేపడతామని, తాను ఏది ఆలోచించినా దేశ భవిష్యత్తు కోసమేనన్నారు.

కులం, మతం, ప్రాంతం పేరు చెప్పి ఓట్లు వేయటం కాదని, అభివృద్ధిని చూసి ఓటు వేయండని పిలుపునిచ్చారు. మరో కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉన్న తరుణం లో రాష్ట్ర ప్రజానీకం మంచికోరే కాంగ్రెస్ తో కలిశామని ఈ సందర్భం గా చెప్పుకొచ్చాడు . గతం లో చాలా జరిగిండవచ్చు , అవి అన్ని పట్టుకొని కూర్చుంటే అభివృద్ధి ని సాధించడం కష్టం అని అన్నాడు . రాష్ట్ర మేలు కోసం ఎవరితోనైనా కలుస్తాం అని ఈ సందర్భంలో చెప్పాడు .

Related News