//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పార్టీ ముఖ్య నేతలతో బాబు భేటీ..!

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం క్షణ క్షణానికి మారిపోతుంది. ఏపీ కి ప్రత్యేక హోదా విషయం లో అన్ని రాజకీయ పార్టీ లు తమ భవిష్యత కార్యక్రమాలపై ద్రుష్టి సారించాయి.ఈ రోజు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలు వెంటనే తన ఇంటికి రావాలని పిలిచారు.

మరికాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు నాయుడు, గత రెండు రోజులుగా రాష్ట్రము లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంపై తదుపరి చర్యలో భాగం గా ఎలా వ్యవహరించాలన్న విషయమై చర్చిస్తారని సమాచారం

కేంద్ర మంత్రుల రాజీనామా, ప్రధాని ఫోన్ అనంతర పరిణామాలను విశ్లేషించనున్న టీడీపీ నేతలు, ఎన్డీయేలో కొనసాగాలా, వద్దా అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కుటుంబరావు తదితర నేతలు కూడా హాజరు కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కొంతమంది సీఎం నివాసానికి చేరుకోగా, మరికొందరు దారిలో వున్నారని సమాచారం.

Related News