//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు కోసం భారి ఏర్పాట్లు

Category : district state

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న ప్రకాశం కందుకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో కందుకూరులో నిర్వహించనున్న సీఎం బహిరంగ సభా ప్రాంగణాన్ని కలెక్టర్‌ వినయ్‌చంద్‌, ఎస్పీ సత్యఏసుబాబులు పరిశీలించారు. సభా వేదిక ఏర్పాట్లు, భద్రతా పరమైన చర్యలు, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన స్టాల్స్‌ ప్రదేశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి బస చేసే ప్రాంగణంలో బారికేడ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

వాహనాల పార్కింగ్‌కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోకూరు సాగు నీటి చెరువులో నీరు- ప్రగతి కింద చేపట్టిన పనులను పరిశీలిస్తారు. బడేవారిపాలెం, నూకవరం ఎస్సీ కాలనీల్లో పర్యటిస్తారు. బడేవారిపాలెంలో ప్రజలతో ముఖాముఖి సమావేశం అవుతారు. ఈ మేరకు ఆయా ప్రదేశాలను అధికారులు పరిశీలించారు. హెలీప్యాడ్‌ నుంచి ఆయకట్టు రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటుకు గాను...

చేపడుతున్న పనులను పరిశీలించి సూచనలు చేశారు. నూకవరం ఎస్సీ కాలనీలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. మరికొన్ని సీసీ రోడ్ల నిర్మాణానికి, రూ.7.5 లక్షలతో అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. బడేవారిపాలెం ఎస్సీ కాలనీలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. రూ. 20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, రూ.7.5 లక్షలతో అంగన్‌వాడీ కేంద్ర భవనం, గ్రామంలో రూ.7.5 లక్షలతో అంగన్‌వాడీ భవనం, 40 ఎన్టీఆర్‌ గృహాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.