Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీనీ గద్దె దించ‌డానికి చంద్ర‌బాబు కొత్త టెక్నిక్ .....?

Category : national politics

ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోడీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించామని ,దానికి ప్ర‌తి రూప‌కంగా మోడీ ఈసీ రూపంలో మాపై క‌క్ష తీర్చుకున్నాడ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆరోపిస్తున్నారు.అయితే ఈ విష‌యాలు అన్ని పాత చింత కాయ ప‌చ్చ‌డిలే అయినా...తాజాగా మోడిని దెబ్బ తీయ‌డానికి చంద్ర బాబు కొత్త టెక్నిక్ ను వాడుతున్నారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌లో చంద్ర బాబు జేడిఎస్ పార్టీ త‌రుపున ప్ర‌చారం చేయ‌డానికి సిధ్ధమైన‌ట్లు స‌మాచారం .క‌ర్ణాట‌క‌లో దాదాపు 50 పైగా నియోజ‌క వ‌ర్గాల‌లో తెలుగు వారు ఉన్నారు .ఈ తెలుగు వారి ఓట్లు బీజేపీ ఖాతాలోక వెళ్ల‌కుండా చంద్ర బాబు ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా అక్క‌డికి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం .

అయితే ఇక్క‌డ ప్ర‌ధానంగా బీజేపేత‌ర నేత‌ర ఇళ్ల‌లో ఐటీ దాడులు చేయించ‌డం, తెర వెనుక నుండి ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డ్డ ప్ర‌త్య‌ర్థుల ఓట‌మికి మోడీ త‌న అధికారాన్ని ఉప‌యోగించ‌డం వంటి అంశాలు ఈ ప్ర‌చార స‌భ‌లో చెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం . ప్ర‌స్తుతం చంద్ర బాబు ఈవీఎంలు వ‌ద్దు బ్యాలెట్ లు ముద్దు అనే అంశంపై జాతీయ నేత‌ల మ‌ధ్ధ‌తు కూడ‌గ‌డుతున్నారు.