//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మంత్రి వర్గ భేటీలో బాబు కీలక నిర్ణయాలు ... ఎన్నికలే టార్గెట్

Category : state politics

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే ప్రధాన పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. వ్యూహాత్మకంగా ప్రత్యర్థి వర్గాలకు చెక్ పెట్టే ప్లాన్లు చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న సంచలన నిర్ణయం నేపథ్యంలో వాటిని తలదన్నేలా ప్రకటనలు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు సైతం ఓటు బ్యాంకు లక్ష్యంగా హామీలను ఇవ్వడమే కాకుండా వాటిని ఎన్నికలకు ముందే అమలు చేస్తున్నారు. దీంతో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు వాటిని ఎన్నికల నోటిఫికేషన్ లోపు అమలు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. చాలా రోజుకాలుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు మధ్యంతర భృతిపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి 20శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. అమరావతిలో జేఎన్‌టీయూ ఎక్స్‌టెన్షన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారంపైనా మంత్రివర్గంలో చర్చించారు. అలాగే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి హెల్త్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల్లో ఆస్పత్రుల స్థాయి పెంచాలని.. విజయనగరంలో ఏర్పాటు చేసే వర్సిటీకి గురజాడ అప్పారావు పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏలూరు స్మార్ట్‌ సిటీపైన కూడా చర్చ జరిగింది. ఇక గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులను ఎత్తివేసే అంశంపై కూడా చర్చించారు.

Related News