Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు తరువాత టీడీపి కి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దిక్కా....?

Category : politics

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో నూతన అధ్యాయానికి తెర తీస్తూ వైసీపీ పార్టీ గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ విజయంతో వైసీపీ పార్టీ అపూర్వ విజయాన్ని అంది పుచ్చుకుంటే....ఇదే ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన తెలుగుదేశం పార్టీ మాత్రం దశాబ్దాల రాజకీయ కాలంలో పూర్తి అపఖ్యాతి నీ మూట కట్టు కోవలసి వచ్చింది. ఇది ఇలా ఉంటే ఇక పై ఆ పార్టీ భవిషత్తు కార్యాచరణ ఏమిటి అన్న దాని పై సర్వత్రా చర్చనీయాంశం గా మారింది.ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న దూకుడు రాజకీయాలకు భిన్నంగా చంద్రబాబు చేసే పాత చింతకాయ పాలిటిక్స్ సరిపోవనే అంటున్నారు ఆ పార్టీ అభిమానులు. ఏది ఏమైనా ఆ పార్టీ కి చంద్రబాబు కంటే సమర్ధుడైన మరో అధినేత దొరకడం కష్టమే అయిన ఆయన తరువాత ఆ పార్టీ కి సమర్థుడైన నాయకుడు ఎవరన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటి వరకు టిడిపికి చంద్రబాబు నాయుడే సర్వస్వం అనేలా ఆ పార్టీని ముందుండి నడిపించాడు.అంతే కాకుండా తన రాజకీయ వారసుడిగా ఆయన తన కుమారుడు నారా లోకేష్ నే ఇన్నాళ్లు పరిగణిస్తూ వస్తున్నారు బాబుగారు.అయితే ఈ విషయంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా లేదనేది వాస్తవం.అయితే నారా లోకేష్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా, మంత్రి పదవినీ కట్టబెట్టి ఎంతగా ప్రమోట్ చేసిన ఆయనపై ముందు నుంచి ఉన్న పప్పు అన్న ముద్ర మాత్రం పోవడం లేదు. అవకాశం దొరికినా ప్రతి సారి తప్పులతడకగా తెలుగు మాట్లాడడంలో తప్పులు దొర్లడం ఆయనకో పెద్ద లోపం.ఈ లెక్కన చూసుకుంటే బాబు తరువాత లోకేష్ కరెక్ట్ కాదు అనే అర్థం అవుతోంది. వారసుడిగా నా పేరు పై ఉన్న బరువు బాధ్యతలను చినబాబు ఏ మేరకు మోస్తారు అనేది అనుమానంగానే ఉంది చంద్రబాబు కి, ఆయన తర్వాత నారా లోకేష్ నీ టిడిపి అధినేత గా ప్రకటించడం అంత ఈజీ పని కాదు .

అయితే కొత్తగా ఈ లిస్ట్ లో నారా బ్రాహ్మణి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే దేశ రాజకీయాల్లో సైతం రాహుల్ గాంధీ కంటెను ప్రియాంక గాంధీ కే ఎక్కువ పాపులారిటీ ఉంటుంది.ఈ లెక్కన ఆమె రాజకీయ ఆరంగేట్రం అనేది ఇప్పటివరకైతే ఎలాంటి క్లారిటీ రాలేదు.చూడాలి మరి మును ముందు.ఇక చంద్రబాబు బావ బాలకృష్ణ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.... సినీమా హీరోగాను ఎన్టీఆర్ తనయుడు గాను చంద్రబాబు వియ్యంకుడు గాను ఆయనకు ఆ పార్టీలో ప్రాధాన్యం ఉంటుంది . కానీ ఆయన్ని నమ్మి సీరియస్ గా రాజకీయ నేతగా ఎవ్వరూ పరిగణించరు ఆ విషయం బాలయ్యకు కూడా బాగా తెలుసు మైక్ ముందు సరిగ్గా మాట్లాడటం రాదు ఇక రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు బాలయ్య నుంచి అసలు ఊహించ లేము.అందుకే ఆ పార్టీకి ఆయన ఏ మాత్రం అర్థం కాడు... కనుక చంద్రబాబు లిస్ట్ లో బాలకృష్ణ ఉండకపోవచ్చుఇక టిడిపి పార్టీ లోని చాలా మంది సీనియర్లు ఉన్న ప్పటికి.... వారు ఎవరికీ పార్టీని లీడ్ చేసే అంత సీన్ లేదనేది తెలుగు తమ్ముళ్ల మాట చంద్రబాబు కాబట్టి ఇన్నాళ్లు టిడిపిని నడిపించారు కానీ...

లేకపోతే ఈపాటికి టిడిపి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ లా నిత్యం కుమ్ములాటలతో ఉండేది.ఏది ఏమైనా చంద్రబాబు నాయకత్వ లక్షణాలను మెచ్చుకొని తీరాల్సిందే ఈ సంధర్బంగా. ప్రస్తుతం బాబు తరువాత ఆ పార్టీ కీలక పదవికి ఎవరు అయితే బాగుండు అనే ఆలోచనపై చర్చ జరుగుతోంది. అయితే ప్రతి ఒక్కరిలో ఉన్న అభిప్రాయం ఆలోచన ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ అయితేనే ఈ పదవికి అర్హుడని.... అంతే కాకుండా ఈ విషయంలో మంచి వాక్చాతుర్యంతో గతంలో పార్టీకి ప్రచారం చేసిన తీరు... ఆయన మాటల్లో ఉంటే భారీతనం. నిజాయితీ గా పనిచేయడం లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది అనే ఆలోచన గట్టిగా వినిపిస్తోంది.చూడాలి మరి ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాడనీ.