Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబే నాలుగోసారి సిఎం అవ్వడం పక్కా

Category : politics

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ సీఎం ఎవరు అని ,కొంతమంది తాజా సర్వే లు అని ఎవరికి తోచిన లెక్కలు వారు చెప్తున్నారు ,ఇంకొంత మంది పండితులు గ్రహాలు ను బట్టి ఎవరు సీఎం అవుతారు అనేది సోషల్ మీడియా లో చెప్తున్నారు , ట్రెండ్ మారడం వల్ల జ్యోతిష్యాన్ని సిల్లీగా తీసుకుంటున్నారు కానీ… చాలా సందర్భాల్లో అవి నిజమైన దాఖలాలున్నాయి. అందులో ఉన్న మర్మమేంటో తెలీదు కానీ… కొందరు ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన కొన్ని జోస్యాలు రియల్ లైఫ్‌లో నిజంగానే జరిగాయి. అందుకే… ఇప్పటికీ జ్యోతిష్యాన్ని కొందరు నమ్ముతుంటారు. ముఖ్యంగా సినీ, వ్యాపార, రాజకీయ నాయకులు వీటిని తరచూ ఫాలో అవుతుంటారు.

తాజాగా ఇంకోకారు నేను చెప్పింది గతం లో జరిగిందని 2012లో కిర‌ణ్ కుమార్ రెడ్డి సిఎం అవుతారని, 2014 ఎన్నిక‌ల్లో మోదీ గెలుస్తార‌ని, ఏపీలో సీఎం చంద్ర‌బాబు అధికారం చేప‌డ‌తార‌ని అప్పట్లో తాను చెప్పానని… అవన్ని నిజమయ్యాయని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు… తెలంగాణలో జ‌రిగిన‌ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కేసీఆరే విజ‌యం సాధిస్తార‌ని తాను చెప్పినట్లుగానే జరిగిందన్నారు. జంగారెడ్డి గూడెంకు చెందిన రెడ్డిచెరువు సిద్దాంతి మ‌రాటా మ‌ద‌న్ కుమార్ ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. క‌ర్ణాట‌క‌లోని దేవ‌మ్మ త‌ల్లి శ‌క్తి అనుగ్రహంతో తాను 12 ఏళ్లుగా జ్యోతిష్యం చెబుతున్నాన‌ని చెప్పిన ఆయన… ఈసారి తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని, తిరిగి చంద్రబాబే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారని చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఈసారి టిడిపి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని, బాబు నాలుగోసారి సిఎం కావడం పక్కా అని తేల్చి చెప్పారు. గతంలోనూ తాను చెప్పిన జోస్యాలన్నీ నిజమయ్యాయని, ఈసారి కూడా తాను చెప్పినట్లుగానే జరుగుతుందని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. గత ఫలితాలు ఓకే.. మరి ఈసారి ఆయన చెప్పినట్లే టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందా? లేదా? మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే!

Related News