ప్రపంచ మహిళల బాడ్మింటన్ చాంపియన్ షిప్లో రజిత పతకం సాధించిన ప్రముఖ క్రీడాకారిణి పివి సింధును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. తనను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినప్పుడు సింధు మరిన్ని పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్, భారతదేశ పేరుప్రఖ్యాతలు నిలపాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
బాడ్మింటన్ క్రీడ మరిన్ని విజయాలు, రికార్డులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. క్రమశిక్షణ కలిగిన క్రీడాకారిణి అయిన సింధు డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలను సైతం సమర్ధవంతంగా నిర్వహించగలిగే సత్తా ఉంటుందని ఆయన ప్రశంసించారు.
కాగా, ఈ సందర్భంగా కలసిన ఆమె కోచ్ గోపీచంద్ ను అమరావతి బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా అకాడమీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.