Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విజయవాడ టికెట్ కన్ఫర్మ్ చేసిన చంద్రబాబు నాయుడు

Category : politics state

ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్‌ టీడీపీలో చేరారు. మంగళవారం తండ్రి జలీల్‌ఖాన్‌తో పాటు షబానా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సీఎం సమక్షంలో షబానా టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంల టీడీపీ అభ్యర్థిగా తన కుమార్తె పేరును చంద్రబాబు ఖారారు చేసినట్లు తెలిపారు. పశ్చిమ స్థానాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని జలీల్‌ఖాన్‌ అన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్‌ కాలేదని, తన సేవలను పార్టీకి వినియోగించుకుంటామని సీఎం చెప్పారన్నారు. అవసరమైతే గుంటూరు జిల్లాలో కన్నాపై పోటీ చేస్తానని తెలిపారు.

షబానా మాట్లాడుతూ...మొదటి నుంచి తాను సీఎం అభిమానినని, అమెరికాలోని వర్జీనియాలో టీడీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నానని తెలిపారు. అమెరికా నుంచి తమ కుటుంబం ఏపీకి వచ్చేసిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో విజయవాడ పశ్చిమలో ప్రచారం ప్రారంభిస్తానని షబానా ఖాతూర్‌ చెప్పారు.