//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆగిపోయిన బాబు బయోపిక్

Category : movies

ఈప్పుడు ఎక్కడ చుసిన బయోపిక్ ల హడావుడి నడుస్తోంది మొన్న మహానటి లాంటి చిత్రం సూపర్ హిట్ అవ్వటం తో నిర్మాతలు కోడా ఆలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇంకా మంచి ఇమేజ్ తో పాటు కొంత కాంట్రవర్సీ ఉన్న నటీనటులు, రాజకీయ నాయకులు, పాపులర్ అయిన సాధారణ వ్యక్తుల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కించే పనిలో బిజీ అయిపోయారు దర్శక నిర్మాతలు .

ఎన్టీఆర్ తర్వాత తెలుగు దేశం లో మంచి రాజకీయ నాయకుడు గా మంచి పేరు పొందిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ అంటూ “చంద్రోదయం” అనే చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు బాబు ఫాన్స్ . ఓ పక్క బాలయ్య బాబు ఎన్టీఆర్ బయోపిక్ నీ ఓ రేంజ్ లో క్రిష్ డైరెక్షన్లో బారిగా తీస్తున్నాడు బిజినెస్ కోడా బాగానే చేస్తుంది . టీడీపీ అభిమానులు కోడా ఈ బయోపిక్ నీ ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ లో అనుకుంటున్నారు అంత క్రేజ్ చంద్రబాబు బయోపిక్ కోడా వస్తుందేమోనని తెగ సంబరపడిపోయారు చంద్రబాబు అభిమానులు మరియు టి.డి.పి కార్యకర్తలు. అయితే.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ “చంద్రోదయం” ఫస్ట్ లుక్ విడుదలైంది. సదరు ఫస్ట్ లుక్స్ & పోస్టర్ చూసినవాళ్ళందరూ “ఇది బయోపిక్ ఫిలిమా లేక స్పూఫ్ తీస్తున్నారా?” అని సందేహపడ్డారు.

టి.డి.పి కార్యకర్తల అంచనాలను ఏమాత్రం లెక్కచెయ్య కుండా మొన్నామధ్య విడుదల చేసారు చంద్రబాబు-ఎన్టీఆర్ పిక్స్ అంటూ ఎవరో డూప్స్ తో సినిమా షూటింగ్ చేయడంతో తెలుగుదేశం తమ్ముళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీనియర్ ముఖ్యమంత్రి మీద తీసే సినిమా ఆయన ఇమేజ్ కు గౌరవాన్నిచ్చేలా ఉండాలి కానీ.. ఈ బయోపిక్ చంద్రబాబు ని నవ్వులపాలు చేసేలా ఉండకూడదు అని భావించిన టి.డి.పి వర్గాలు ఉన్నపళంగా ఆ సినిమా షూటింగ్ ఆపేయాలని సదరు దర్శకనిర్మాతలు టీడీపీ హై కమాండ్ ఆర్డర్లు జారీ చేశారట. తమ ఎంతో అభిమాన తో తీస్తున్న బాబు గారి బయోపిక్ నీ ఆదరిస్తారనుకొన్నవాళ్లే ఆపేయమని చెప్పడంతో షాక్ తిన్న వారు వేరే దారి లేక ఆ సినిమాను ఉన్నపళంగా ఆపేశారట. దాంతో చంద్రబాబు నాయుడు అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారు.