Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు మళ్ళి అదే తప్పు చేస్తున్నాడా

Category : politics

రాష్ట్రం విడిపోకముందు అనగా 2009 ఎలక్షన్స్ లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ని ఎదుర్కొనేందుకు అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, టిఆర్ఎస్, బీజేపీ లు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించి మళ్ళి రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. అపుడు చంద్రబాబు చేసిన చిన్న మిస్టేక్ వలన టీడీపీ అభ్యర్థులు గెలిచే స్థానాలలో వేరే అభ్యర్థులను నిలబెట్టవలిసి వచ్చింది.


హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో టీడీపీ కి మంచి పట్టుంది. ఇక్కడ చదువుకున్నవారు మరియు సెటిలర్స్ ఎక్కువ. పైగా టీడీపీ పార్టీ అన్న చంద్రబాబు అన్న అమితమైన ప్రేమ. ఈ రెండు జిల్లాలలో టీడీపీ అభ్యర్థి అయితే చాలు ఓట్లు గుద్దేస్తారు ఇక్కడి జనం. అయితే 2009 ఎన్నికలలో టీడీపీ, టిఆర్ఎస్, బీజేపీ లు మహాకూటమిగా ఏర్పడిన నేపధ్యలో ఈ రెండు జిల్లాలో ఎక్కువ స్థానాలు టిఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకే కేటాయించాడు చంద్రబాబు. దీనివలన గెలిచే స్థానాలు ఓడిపోవలసి వచ్చింది.

అయితే ఇప్పుడు 2019 లో జరగబోయే ఎన్నికలలో చంద్రబాబు మళ్ళి అదే తప్పు చేస్తున్నాడంటూ ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ జగబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సీట్ల పంపకం విషయంలో టీడీపీ గెలిచే స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులకు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు తెలంగాణాలో టీడీపీ కున్న క్యాడర్ ఏ పార్టీకి లేదు. కానీ బలమైన నాయకుడు లేక పోవడంవలన పైకి రాలేకపోయింది. ఇక 2019 ఎలక్షన్స్ లో చంద్రబాబు తన అభ్యర్థులను రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో నిలబెడితో ఎక్కువ సీట్లు రావడమే కాకుండ మహాకూటమి కూడా అధికారంలోకి వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చంద్రబాబు 2009 , 2014 ఎలక్షన్స్ లో చేసిన తప్పే 2019 ఎలక్షన్స్ లో చేస్తాడా? లేక తన పార్టీ అభ్యర్థులనే నిలబెడతాడా? తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాలసిందే.

Related News