//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ఎమ్మెల్సి కోలుకోవాలని చంద్రబాబు

Category : district state

ఎమ్మెల్సీ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి త్వరగా కోలుకొనే విధంగా మెరుగైన వైద్య సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకొని హెలికాప్టర్‌లో నగరానికి చేరుకున్న సీఎం కలెక్టరేట్‌ కూడలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ మూర్తిని పరామర్శించారు. అనంతరం ఆరోగ్య మిత్రలను విధుల్లో యథావిధిగా కొనసాగించాలని ఎన్టీఆర్‌వైద్య సేవ కింద సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. మంగళవారం సాయంత్రం ఆసుపత్రి వద్ద సీఎంను కలిసి వారు వినతి పత్రం అందజేశారు. దీర్ఘకాలంగా పనిచేస్తున్న తమను తొలగించవద్దని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.