//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కర్ణాటకపై చంద్రబాబు ఏమన్నారంటే

Category : politics national

కర్ణాటకలో రాజకీయ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. కర్ణాటకలో అప్రజాస్వామిక విధానాలను బీజేపీ అవలంభిస్తోందని ఆయన మండిపడ్డారు. మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందన్న చంద్రబాబు... జయలలిత చనిపోయిన తర్వాత తమిళనాడులో కుట్రలు చేసిందని, ఇప్పుడు కర్ణాటకలో చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో గాలి జనార్దన్‌రెడ్డి బేరసారాలు జరుపుతున్నారని, ఎన్నికల ముందు మోదీ, అమిత్‌షా ఏం చెప్పారు?.. ఇప్పుడేంచేస్తున్నారు? అప్రజాస్వామ్య విధానాలతో దేశానికేం సంకేతాలిస్తారని చంద్రబాబు నిలదీశారు. కర్ణాటక, తమిళనాడులో గవర్నర్‌ వ్యవస్థలు విఫలమయ్యాయని సీఎం విమర్శించారు. దేశాన్ని ఉద్దరిస్తామన్న పార్టీలు, నాయకులు... కర్ణాటక పరిణామాలపై ఒక్క మాటైనా మాట్లాడడం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. వృద్ది చెందుతున్న రాష్ట్రాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.