//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేవుడు రాసిన స్క్రిట్ తో మరో సారి చంద్ర బాబుకి షాక్ ఇచ్చిన.... ఏపీ సీఎం జగన్.

Category : politics

ఏపి సీఎం జగన్ అసెంబ్లీ లో మాట్లాడుతూ.....ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్ తమ్మినేని సీతారాంను అభినందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలోనే గత చంద్రబాబు పాలనపై విమర్శనా అస్త్రాలు ఎక్కు పెట్టారు. గత అసెంబ్లీలో విలువలతో కూడిన నిబంధనలు పాటించలేదని ఈ సంధర్బంగా ఆయన గుర్తచేశారు.గతం లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు మైక్ కూడా ఇవ్వకుండా తమ గొంతునొక్కేశారని స్పీకర్ తో ఈ సంధర్బంగా సూచించారు.మాజీ సీఎం చంద్రబాబుకు .... ప్రస్తుత సీఎం అయిన తనకు మధ్య తేడా ఏమిటో ఆయన చెప్పుకొచ్చారు.చంద్రబాబుకు వచ్చిన 23 ఎమ్మెల్యేలలో ఓ ఐదుగురిని మా పార్టీ లోకి లాగేస్తే టీడీపీ కి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని.. అలా చేయమని.... తమ పార్టీలో కొందరు వైసీపీ మంత్రులు తనతో అన్నారని.

కానీ విలువలకు కట్టుబడ్డ నేతగా.. తాను అలా చేయనని ఖరాఖండీగా చెప్పానని జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అలా చేస్తే నాకు.. చంద్రబాబుకు తేడా ఏంటని చెప్పుకొచ్చాడు..ఇది తన నిర్ణయం కాదని ఆ దేవుడు రాసిన స్క్రిప్ట్ అని.చంద్రబాబు హయాంలో ప్రతిపక్షంలో ఉన్న తమ 23 మంది ఎమ్మెల్యేలను లాగేసి టీడీపీ కండువా కప్పి నలుగురినీ మంత్రులుగా చేశారని.. ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన వారిని అధికారపక్షంలో కూర్చుండబెట్టడం తనను ఎంతో కలిచివేసిందన్నారు. ఇప్పుడు ఆయనకు అదే 23మంది ఎమ్మెల్యేలు మిగిలారని.. ముగ్గురు ఎంపీలను ఫిరాయిస్తే ముగ్గురు ఎంపీలనే గెలిపించాడని.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చంద్రబాబు తీరును జగన్ ఎండగట్టారు.

టీడీపీ ఎమ్మెల్యేలను లాగితే అనర్హత వేటు వేయండి..చంద్రబాబు లా తాను ప్రతిపక్ష గొంతు నొక్కనని.. వారి ఎమ్మెల్యేలను ఒకవేళ మా పార్టీలో చేరాల నుకుంటే,లేదా చేరుకోవాలి అనుకుంటే ముందుగా వారిని ఆ పదవికి రాజీనామా చేసే రమ్మంటానని.. అలా రాకపోతే మీరే అనర్హత వేటు వేయండని జగన్ ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేనిని కోరారు.ఇలా జగన్ తన్ తొలి ప్రసంగంలోనే చంద్రబాబు నాయుడికి దిమ్మదిరిగే పంచ్ విసిరాడు. ఆయన ఫిరాయింపులను ప్రతిపక్షంపై గతంలో చేసిన దాడులు గొంతు నొక్కేయడాన్ని ప్రస్తావించి చంద్రబాబు మరో షాక్ ఇచ్చారు. విలువలు సంప్రదాయాలతో సభ నడిపి ఏపీ గౌరవాన్ని మరింత నిలబెడుతానని.. చంద్రబాబులా అనైతికంగా వ్యవహరించ బోనని జగన్ హామీ ఇచ్చారు.