Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గెలిచే ఎమ్మెల్యే లకు గేలం వేస్తున్న ......చంద్ర బాబు, జగన్ ఫలితం దక్కేనా...?

Category : politics

మొన్న జరిగిన ఏపి ఎన్నికలను 2014 ఎన్నికలతో అసలు పోల్చలేం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వచ్చాయనే చెప్పుకోవాలి.అందులో ముఖ్యంగా జగన్ అప్పటి జగన్ కానే కాదు. ఆ సంగతి ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్. చూసుకుంటే నే అర్థం అవుతుంది. ఫార్టీ పరంగా 40 ఏళ్ల బాబు రాజకీయాలను చాలా బలంగానే వైసీపీ,టీడీపీ నీ ఢీ కొట్టింది. ఈ హోరా హోరి పోటీలో ఎక్కడా తేడా రాకుండా జగన్ తన వ్యూహాన్ని ముందుకు తీసుకు పోతున్నాడు.అంతే కాకుండా ఈ ఎన్నికల్లో బాబు సైతం కొంత తడబడ్డారు కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ఏ లోటూ లేకుండా ముందుకు సాగిపోయారు. మరి ఆ విధంగా చూసుకుంటే జగన్ సరి సాటిగానే ఈసారి నిలిచారని అనిపిస్తుంది.

ఇక కౌంటింగుకు సమయం దగ్గర పడుతోంది. దాంతో అటు చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆయన నిజానికి చాలా కాలం నుంచే క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తూ పోతున్నారు. వైసీపీ అయితే ఇన్నాళ్ళూ క్యాడర్ కి కూడా రెస్ట్ ఇచ్చేసింది. ఇక కౌంటింగ్ యుధ్ధం ఉంది అక్కడ కూడా బాబు మేనేజ్మెంట్ ని తట్టుకోవాలి.దానికే ఇపుడు జగన్ పై ఎత్తులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తమ పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను జగన్ ఈ నెల 19 తరువాత ఒక చోటకు చేర్చే పనిలో వైసీపీ ఉన్నట్లుగా సమాచారం. ఈ నెల 19న ఎన్నికలు మొత్తం పూర్తి అవుతాయి. ఎగ్టిట్ పోల్ సర్వేలు వస్తాయి. దాంతో టీడీపీ చాణక్య రాజకీయం చేస్తుందని జగన్ భావిస్తున్నారు. అంతే కాదు. వందకు పైగా మెజారిటీ సీట్లు వస్తే ఫరవాలేదు.... కానీ పోటా పోటీ మెజారిటీ వస్తే మాత్రం టీడీపీ తమ ఎమ్మెల్యెలకు గేలం వేస్తుందననే అనుమానం.....అటూ జగన్ కి,ఇటు పరోక్షంగా చంద్ర బాబు కి సైతం ఉందనే చెప్పుకోవాలి. అందువల్ల తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులను కాపాడుకునేందుకు ఇప్పటి నుంచే తెగ వ్యూహాలు రచిస్తున్నారు. ఎలాగైనా ఈసారి అధికార పీఠం కొట్టాలని జగన్ గట్టిగా భావిస్తున్నారని ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.చూడాలి మరి ఎవరి అదృష్టం ఎలా ఉందన్నది.