//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చందాకొచ్చర్‌ ఒక రోజు వేతనం రూ.2.18లక్షలు

Category : business

 దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ విత్త సంస్థ ఐసిఐసిఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ చందాకొచ్చర్‌ ఒక రోజు వేతనం అక్షరాల రూ.2.18లక్షలు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.7.85 కోట్ల వార్షిక వేతనాన్ని ఆమె అందుకున్నారు. అంతక్రితం ఏడాది అందుకున్న వేతనంతో పోలిస్తే 64 శాతం ఎగబాకింది. 

దీంట్లో మూల వేతనం ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగి రూ.2.67 కోట్లకు చేరుకున్నట్లు వార్షిక నివేదికలో బ్యాంక్ వెల్లడించింది. 2015-16 సంవత్సరంలో రూ.4.79 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకోగా, కనీస వేతనం కింద రూ.2.32 కోట్లు లభించింది. 

దీనికి తోడు పని తీరు సంబంధించిన బోనస్‌ కింద కొచ్చర్‌కు రూ.2.2 కోట్లు చెలించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో అప్పుడు ఇవ్వాల్సిన బోనస్‌ను 2016-17లో చెల్లించారు. 

కొచ్చర్‌ జీతభత్యాల పేరుతో రూ.32 లక్షలను, గ్రాట్యుటీ కింద రూ.22 లక్షలను ఆర్జించారు. ఇందులో రూ.13.75 లక్షల ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్లను కలుపలేదు. ఈ ఏడాది భారీగా పెరిగిన బోనస్‌లతో వేతనం కూడా భారీగా పైకి ఎగిసింది. ఆమె నెల జీతం ఇతర సదుపాయాలు కలపకుండానే రూ.13.50 లక్షల నుండి రూ 26 లక్షల మధ్య ఉటోందని బ్యాంక్‌ తెలిపింది.

 భారీ జీతంతో పాటు కొచ్చర్‌కు విద్యుత్తు, ఫోన్‌, గ్యాస్‌, నీటి వాడకం, విలాసవంతమైన కారు, క్లబ్‌ చార్జీలను కూడా బ్యాంకే బరిస్తోంది. దీనికి తోడు గ్రూపు ఇన్సురెన్స్‌, ఎల్‌టిఎ, పిఎఫ్‌లు అదనం. ఈ పెంపుతో అత్యధిక మొత్తంలో వేతనం ఆర్జిస్తున్న మూడో బ్యాంకింగ్‌ చీఫ్‌ గా చందాకొచ్చర్‌ ఉన్నారు.