//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేనలోకి చేరిన మరో ప్రముఖ నేత: ఆశ్చర్యం లో పవన్...

Category : politics

ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తమ భవిష్యత్తు కోసం కొందరు నేతలు వేరే పార్టీలలోకి జంప్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు జనసేనలోకి వలస వెళుతున్నారు. ఈ మధ్య ఉమ్మడి రాష్ట్ర చివరి స్పీకర్ నాదేండ్ల మనోహర్ కాంగ్రెస్ గూటి నుంచి పవన్ సమక్షంలో జనసేనలోకి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కీలకనేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి చేరుతున్నాడు.

డీసీసీ ఉపాధ్యక్షుడు హనుమాన్‌జంక్షన్‌కు చెందిన చలమలశెట్టి రమేష్‌ బాబు పార్టీకి రాజీనామ చేసినట్లు ప్రకటించారు. తాను 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించాను అని అన్నారు. తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు రమేష్ బాబు.

అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ విధానాలు నచ్చడంతో ఆ పార్టీలోకి చేరుతున్నట్లు చెప్పారు. తనతోపాటు కొత్తపల్లి పార్టీ గ్రామ అధ్యక్షుడు పల్నాటి చంటి, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామకృష్ణ, తదితరులు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో త్వరలో జనసేనలో చేరుతామని అయన అన్నారు.

Related News