//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తాత పాత్రలో మనవడు.....!

Category : movies

నాగ చైతన్య తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.అక్కినేని వారసుడు గ తెలుగు తెరకు పరిచయమైన కొంతకాలం లోనే తానేంటో నిరూపించుకుంటున్నారు.వైవిధ్యమైన కథలతో తాను అందరిని ఆకట్టుకుంటున్నారు.తాను నటించిన పాత్రలన్నీకూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలవటం విశేషం.ఇప్పుడు తాజాగా మరో అద్భుతమైన పాత్రలో చైతు అలరించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.వివరాలలోకి వెళ్తే,

నాగ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈ మూవీ లో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి ఇతర స్టార్ నటీ నటులు నటిస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో నాగ చైతన్య చేరాడు. ఈ మూవీ లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషించేందుకు చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ నెల 14, 15వ తేదీలలో చైతు చిత్ర యూనిట్ తో జాయిన్ కాబోతున్నాడు. ఈ నెల చివరి వారం లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కాబోతుందని అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న, ప్రియాంక దత్ లు నిర్మిస్తున్నారు.

Related News