చైనా కు చెందిన ‘షుఇది జిబో’ అనే సంస్థ దేశవ్యాప్తంగా పలు స్కూళ్లలో లైవ్ స్ట్రీమింగ్ ఛానెల్స్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా పాఠశాలలో తమ పిల్లలు ఎలా ఉంటున్నారు అనే విషయాలు తల్లిదండ్రులు తెలుసుకొనేందుకు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకొనేందుకు పాఠశాలకు వెళ్లి విచారిస్తారు. కానీ ఇది అందరికి అనుకూలంగా ఉండదు. అలాగే పాఠశాలలో టీచర్లు పాఠాలు సరిగా చెప్పట్లేదని.. విద్యార్థుల్ని కొడుతున్నామని తల్లిదండ్రులు చేస్తున్నఆరోపణలకు సమాధానం చూపేందుకు కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.
అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ విధానంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు ఈ లైవ్ స్ట్రీమింగ్పై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఇది వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలిగించే ఉందన్నారు. అలా లైవ్ స్ట్రీమింగ్ పెట్టడం వల్ల తల్లిదండ్రులే కాకుండా ఇతరులు కూడా చూసే అవకాశముందని.. అది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వకపోవడంతో ఈ విధానాన్ని కొనసాగించేందుకు స్కూల్ యాజమాన్యాలు మక్కువ చూపిస్తున్నాయి.