//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాకినాడలో పెట్రో కాంప్లెక్స్ కు సహితం కేంద్రం మొండి చేయి ?

Category : business

ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టం-2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కాకినాడలో ఏర్పాటు చేయవలసిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ విషయంలో సహితం కేంద్రం రాష్త్రానికి మొండి చెయ్యి చూపుతున్నట్లు స్పష్టం అవుతున్నది. మూడేళ్లయినా ఈ దిశలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.

ఈ కాంప్లెక్స్ నెలకొల్పేందుకు గల సాధ్యాసాధ్యాలపై గెయిల్, హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను కలసి సమర్పించిన నివేదిక ఇటువంటి అనుమలకు ఆస్కారం కలిగిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటుచేస్తే అంత లాభదాయకంగా సాగదని వారు స్పష్టం చేశారు.

అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తే ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమం కాగలదని వారు సూచించారు. దానితో . ప్రాజెక్టు లాభదాయకతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు సాయం చేయాల్సి వుందో పది రోజుల్లో లెక్కలు తేల్చి చెప్పమని ముఖ్యమంత్రి వారిని కోరారు.

పర్యావరణ అనుమతులు, లైసెన్సుదారుల ఎంపిక, టోపోగ్రాఫికల్-రూట్-పైప్‌లైన్ సర్వేలపై ప్రతినిధులతో చర్చించారు. రూ. 37 వేల కోట్లతో స్థాపించదలిచిన ప్రాజెక్టుతో 1000 మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది.