Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐఏఎస్, ఐపీఎస్ లపై ఇక కేంద్ర పెత్తనం.. రాష్ట్రాలకు కేటాయింపు లేదు

Posted 5 months ago | Category : national

రాష్ట్రాల అధికారాలను కుదించి, మొత్తం పరిపాలన యంత్రాంగాణపై కేంద్రం పట్టు సాధించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు కీలకమైన పరిపాలన సంబంధ మార్పులు తీసుకు రానున్నది. ఇప్పటి వలే అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్ లలో సగం మందిని రాష్ట్రాలకు కేటాయించి, మిగిలిన వారిని కేంద్రం సర్వీస్ లో ఉంచే పద్దతికి స్వస్తి పలకనున్నారు. ఇక నుండి అందరు కేంద్రం పరిధిలోనే ఉంటారు. అవసరాలను బట్టి రాష్ట్రాలకు డెప్యూటేషన్ పై పంపుతారు.

వారిలో లో జాతీయ సమగ్రతను తీసుకొచ్చే ఉద్దేశంతో ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారుల కేడర్ కేటాయింపులకు సంబంధించి కొత్త పాలసీకి కేంద్రం తుది రూపమిస్తోంది. కొత్త విధానం ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సర్వీసుల అధికారులు తాము పని చేయడానికి ఇప్పటిమాదిరి రాష్ట్రాలను కాక జోన్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతకు సంబంధించిన కొన్ని షరతులను నెరవేర్చిన తర్వాత వారిని సెంట్రల్ డిప్యుటేషన్‌పై వారు ఎంచుకొన్న జోన్లలో నియమిస్తుంది.

కొత్త పాలసీలో ప్రస్తుతం ఉన్న 26 కేడర్‌లను అయిదు జోన్లుగా విభజిస్తారు. మొదటి జోన్‌లో అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్మూ, కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు ఉంటాయి. అలాగే రెండో జోన్‌లో ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, జోన్-3లో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, నాలుగో జోన్‌లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ ఉంటాయి.

 జోన్-5 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉంటాయి. కొత్త విధానం వల్ల ఉదాహరణకు బిహార్‌కు చెందిన అధికారులు తమ కిష్టమైన కేడర్‌లో కాకుండా దక్షిణాది, ఈశాన్య రాట్రల్లో పని చేసే అవకాశం లభిస్తుందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు.

కొత్త విధానం ప్రకారం ప్రతి ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మొదటే తమకిష్టమైన జోన్లను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేడర్‌ను కూడా ప్రాధాన్యతా క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. ఒక వేళ అభ్యర్థి జోన్, కేడర్‌లకు సంబంధించి ఎలాంటి ప్రిఫరెన్స్‌ను పేర్కొనకపోయిన పక్షంలో అతనికి ప్రత్యేకించి ఎలాంటి ప్రాధాన్యత లేదని భావించడం జరుగుతుందని కూడా ఆ అధికారి చెప్పారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే