//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇకనుంచి వాహనాలకు నంబర్ ప్లేటు అమర్చాకే రహదారి పైకి

Category : national business

కొత్త వాహనం కొన్నారా! అయితే ఇక నుంచి రవాణాశాఖ కార్యాలయాల చుట్టు తిరగనవసరం లేదు. అంతకు ముందు కొత్త వాహనం కొంటె రిజిస్ట్రేషన్ కని, నెంబర్ ప్లేటు కోసమని రవాణాశాఖ కార్యాలయాల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగేవారు కదా! ఇక నుంచి అలా చెప్పులు అరిగేలా తిరిగే అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. శాశ్వత నంబర్ ప్లేటు బిగింపు సహా రిజిస్ట్రేషన్ ప్రక్రియనంతటిని వాహన డీలర్ల వద్దే పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయంచింది. ఈ ఏడాది చివరి నుంచి ఈ విధానాన్ని అమలుచేయాలని కేంద్రం యోచిస్తోంది.

నూతన మోటారు వాహన చట్టం ఇటీవల లోక్ సభ లో ఆమోదం పొందింది. రాజ్యసభ అంగీకారం అనంతరం ఈ చట్టం కార్యరూపంలోకి రానుంది. అవినీతి నియంత్రణలో భాగంగా, వ్యక్తిగత వాహనాలతో రవాణాశాఖకు సంబంధం లేకుండా చేయాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గత ఏడాది నుంచే డీలర్ల వద్ద వాహనాలను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాయి, కాని తనిఖీ కోసం వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లాల్సివస్తోంది. మోటారు వాహన తనిఖీ అధికారి ఆమోదించాకే నంబర్ ను కేటాయించేవారు. ఇక నుండి అలా కాకుండా డీలర్ వద్దే నంబర్ ను ఇచ్చేస్తారు. కాని భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్న ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపును మాత్రం యధాతధంగా ప్రభుత్యమే కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాదు ఇక నుండి నంబర్ ప్లేటు ను అమర్చాకే వాహనం రోడ్డు పైకి రావాల్సి ఉంటుందంటా. చూద్దాం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎంతవరకు వినియోగంలోకి వస్తుందో, ఏది ఏమైన ఈ నిర్ణయం అమలులోకి వస్తే వ్యక్తిగత వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాలు, అధికారుల చుట్టు తిరిగే బాధ నుండి ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు.