//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బెజవాడే బెస్ట్: కేంద్ర ప్రభుత్యం

Category : politics

నివాస యోగ్యమైన నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం మరో కీర్తిని తన ఖాతాలో వేసుకొని తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. కేంద్రప్రభుత్వానికి చెందిన మినిస్ర్టీ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌ శాఖ దేశవ్యాప్తంగా 111 నగరాల్లో నిర్వహించిన ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ - 2018 సర్వేలో విజయవాడ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019కి సంబంధించిన సన్నాహక సమావేశం సోమవారం న్యూ ఢిల్లీలోని నేషనల్‌ మీడియా సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ర్యాంకులను ప్రకటించారు. నాలుగు కేటగిరీల్లో జరిగిన సర్వేకుగానూ రెండు ర్యాంకింగ్స్‌లో విజయవాడ నిలిచింది. తొమ్మిది నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమవ్వగా రెండు నెలల క్రితమే నగరానికి చెందిన పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి విజయవాడ నగర పాలక సంస్థ అందించింది. నగరంలో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతుల కల్పన, రవాణా, చెత్త సేకరణ, నీటి సరఫరా, అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆ శాఖ విజయవాడకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో టాప్‌ టెన్‌ నగరాలను హర్‌దీప్‌ సింగ్‌ ప్రకటించారు. అవి వరసగా 1. పుణె 2.నావీ ముంబై 3.గ్రేటర్‌ ముంబై 4. తిరుపతి 5.ఛండీఘర్‌ 6.తానె 7.రాయపూర్‌ 8.ఇండోర్‌ 9.విజయవాడ 10.భోపాల్‌ నగరాలు తొలి పది స్థానాలను దక్కించుకున్నాయి. చెన్నై 14వ స్థానంలోనూ, న్యూ ఢిల్లీ 65వ స్థానంలో నిలిచాయి.

Related News