//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆహార వృధాను అరికట్టనున్న కేంద్ర ప్రభుత్వం.

Category : business national

రెస్టారెంట్ లో మీరు వడ్డించే పళ్లెంలో ఎన్ని చికెన్ ముక్కలు పెడుతున్నారు ?అందులో ఎన్ని ముక్కలు కస్టమర్లు తింటున్నారు ?చికెన్ వేపుడులో కస్టమర్లు రెండు ముక్కలే తినగలిగితే మీరు ఎందుకు ఆరు ముక్కలు సర్వ్ చేస్తున్నారు ?మిగితా నాలుగు ముక్కలు ఏమి చేస్తారు వృధా అయినట్లేగా ?ఎంటి తిక్క ప్రశ్నలు అనుకుంటున్నారా? ఏమీ లేదండి రెస్టారెంట్లలో ఆహార వృధాను అరికట్టేందుకు చర్యలు తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం, అందులో భాగంగానే రెస్టారెంట్లు, హోటళ్ళకు ఓ కొత్త ప్రశ్నావళిని రూపొందించే పనిలో పడింది ప్రభుత్వ సిబ్బంది రంగం.

దేశంలో చాలా వరకు ఆహరం వృధా అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల "మాన్ కి బాత్" కార్యక్రమంలో ప్రసంగించారు. దీని గురించి చర్చించినపుడు కొన్ని కొత్త కొత్త విషయాలు తెలిసాయన్నారు. సార్ "మేం తినేదానికంటే చాలా ఎక్కువగా వడ్డిస్తున్నారు. అందువల్లే మేము తినలేక వదిలేస్తున్నాం, అలా అని మేం ఆహారాన్ని వృధా చేస్తున్నామని అనుకోకండి "అని చాలా మంది తనతో షేర్ చేసుకున్నారని మోదీ "మాన్ కి బాత్" లో అన్నారు. మోదీ ప్రసంగాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఆహార శాకా మంత్రి 'రామవిలాస్ పాసవన్' ఆహార వృధాను అరికట్టే చర్యలు చేపట్టారు. కస్టమర్ అవసరమైన దానికంటే ఎక్కువగా ఆడర్ చేస్తే ఏమి చేయలేము కానీ, వాళ్ళు తింనేంత సర్వ్ చేయలేమా ..? అని రెస్టారెంట్లు, హోటళ్ళను ప్రశ్నించారు. కొన్ని రెస్టారెంట్లలో చాలా ఎక్కువగా ఆహారాన్ని వడ్డించడం, తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకే అన్నిరెస్టారెంట్లు, హోటళ్ళలో ఓకేలా సర్వ్ చేసేలా, అదికూడా కస్టమర్ పూర్తిగా తినగలిగేంత మాత్రమే ఉండేలా చూస్తామన్నారు.

ఈ మేరకు హోటళ్ళ, రెస్టారెంట్ల యాజమాన్యాల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రెస్టారెంట్లులో ఏయే పదార్దాలు ఎంతెంత వడ్డిస్తున్నారో ఓ ప్రశ్నావళిని రూపొందిస్తామన్నారు. దీనిపై ఆహార నిపుణులతో చర్చించి,ఏ ఆహారాన్ని, ఏ కస్టమర్ ఎంత తినగలడో అంచనా వేస్తామని "పాసవన్" తెలిపారు.ఆ తరువాత కొత్త నియమాలతో చట్టంలో సవరణ చేయాలని ఆలోచిస్తున్నట్లు కేంద్రమంత్రి 'పాసవన్' వెల్లడించారు. ఆహారాన్ని వృధా చేయకూడదనే ఈ కొత్త ఆలోచనలను, కేంద్రప్రభుత్వం,హోటళ్లు, రెస్టారెంట్లు ఎంత వరకు అరికడతాయా చూద్దాం.

Related News