//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అందుకేగా అపర చాణక్యుడనేది ?

Category : editorial politics

గత నాలుగేళ్ళుగా ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. కానీ వాళ్ల డిమాండ్‌కు మోదీ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంలేదు. అయితే ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకునేలా చారిత్రిక నిర్ణయం తీసుకుని తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు చంద్రబాబు.

ఎందుకంటే నాలుగేళ్ళుగా ప్రత్యేక హోదా కాకుంటే ప్రత్యేక ప్యాకేజీ అయినా వస్తుంది కదా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని ఎదురు చుసిన ప్రభుత్వానికి నిన్న సాయంత్రం జైట్లీ ప్రకటన తర్వాత అది విన్న ప్రతి తెలుగువాడి గుండె మండుతున్న తరుణాన రాష్ట్రానికి మేలు చేయని ఎవరితోనూ కలిసి ఉండే ప్రసక్తే లేదు అంటూ చంద్రబాబు తాము వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ద్వారా న్యాయం జరగకపోతున్నందున.. నిరసనగా.. ఆ ప్రభుత్వం నుంచి తమ పార్టీ తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

చంద్రబాబు చెప్పినట్లే కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు గురువారం ఉదయం తమ తమ పదవులకు రాజీనామా చేశారు. తాము అడిగనట్లుగా కేంద్రం కోరికలు తీర్చే ఉద్దేశంతో లేదని ముందే చంద్రబాబునాయుడుకు తెలియని విషయమేమీ కాదు. కాకపోతే..సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఒక స్కెచ్ ప్రకారం.. ఇప్పటిదాకా విషయాన్ని లాక్కుంటూ వచ్చారు.

ఏ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంలో తెదేపా భాగంగా మారిందో ఆ లక్ష్యం నెరవేరనందువల్లనే ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. నాలుగేళ్లుగా కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని ఆయన వెల్లడిస్తున్నారు. అరుణ్ జైట్లీ సహా మోడీ కూడా కనీసం ఫోనులో మాట్లాడడానికి కూడా అందుబాటులో దొరకలేదని చంద్రబాబు అంటున్నారు. ఈ రాజీనామాలతో కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుందనేది వాస్తవం.

ముందుగా బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ ఆచరణలో ఆ పని చేయలేక పోయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాటకు, ఆయన హామికి చట్టంలో ఉన్న ప్రత్యేక స్టేటస్ కి కూడా విలువ లేకుండా పోయింది. ఇప్పటి ప్రధాని మోడీ గతంలో ప్రత్యేక హోదా పై హామినిచ్చారు. అమలు చేయడం లేదు.

29 సార్లు ఢిల్లీకి వెళ్లినా పట్టించుకోలేదని కాని బీజేపీ న్యాయం చేస్తుందని మద్దతునిచ్చాం. కానీ ఆ పార్టీ మోసం చేస్తుందని లెక్కలు పక్కాగా లేవంటారు. వడ్డించే వాడు మనవాడు కాకపోతే ఏదో ఒక వంకలు పెడతారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. పోలవరం లెక్కల విషయంలో వాస్తవాలు ఇచ్చాం. ఇంకా అనుమానాలు ఎందుకని ప్రశ్నించారు చంద్రబాబు.

పార్లమెంటులో టీడీపీ నేతలు గట్టిగానే తమ వాణి వినిపిస్తున్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను నెరవేర్చమని కేంద్రాన్ని అడుగుతున్నాం. కానీ వాటిని ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతుందో అర్థం కావడం లేదన్నారు చంద్రబాబు. ఇప్పటికే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తే మీరు చేయాలని బీజేపీ నుంచి తమ పార్టీ నేతలకు ఆదేశాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఏపీ క్యాబినెట్ లోని ఇద్దరు మంత్రులూ రాజీనామా చేశారు.

ఈ పరిణామాలు అన్నీ ఎటు దారి తీస్తాయో కాలమే నిర్ణయించాలి