ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌తో తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఫొటోలు దిగారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరవగా.. తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన చంద్రబాబు, కేటీఆర్, లోకేష్ అక్కడ సరదాగా ఫొటోలు దిగారు. ఈ సదస్సులో ఎంపీ, ప్రముఖ వ్యాపార వేత్త గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. జయదేవ్ కూడా లోకేష్, కేటీఆర్‌తో కలిసి ఫొటో దిగడం విశేషం.
స్విట్జర్లాండ్‌కు చెందిన ‘పయనీర్’ సంస్థతో ఒప్పందం కుదిరింది. వ్యవసాయ రంగంలో ఈ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. అలాగే... పర్యావరణ సాంకేతికత, జీవ శాస్త్రాలు, పట్టణప్రాంత అభివృద్ధిలో జ్యూరిచ్ ఏపీకి సహకరించనుంది. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.