//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కలవరం రేపుతున్న చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు

Category : national politics

కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్  పి. చిదంబరం నివాసంలో సీబీఐ మంగళవారం ఉదయం నుండి సోదాలు చేపట్టింది. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసు దర్యాప్తులో భాగంగా చెన్నైలోని చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ నివాసాలతో పాటు చెన్నైలో మొత్తం 14 చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

కార్తీ చిదంబరం తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున సంపాదించారనీ, కుమారుడికి ప్రయోజనాలు చేకూర్చేలా చిదంబరం నిర్ణయాలు తీసుకున్నారనీ ఆరోపణలున్నాయి. కార్తీ చిదంబరం, ఆయనకు సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఒక సంస్థకు గత నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. రూ.45 కోట్ల మేర ఫెమా ఉల్లంఘనలకు పాల్పడి ఆరోపణలపై ఈ నోటీసులు పంపింది. 

ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో కూడా చిదంబరం, ఆయన కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఐటీశాఖ పలుసార్లు చిదంబరం నివాసాలపై దాడులు చేపట్టింది. ఈ కేసులో చిదంబరం పాత్రపై నివేదిక కూడా రూపొందిస్తున్నట్లు ఇటీవల ఐటీశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది.

దీంతో ఈ కేసులో చిదంబరంపై విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ మేరకు నేడు సీబీఐ సోదాలు చేపట్టింది. గతంలో యుపిఎ ప్రభుత్వంలో హోమ్, ఆర్ధిక వంటి కీలక శాఖలు చేపట్టిన చిదంబరం వంటి సీనియర్ ప్రతిపక్ష నాయకుడి ఇంట్లో సిబిఐ దాడులు జరపడం ఇదే ప్రధమం. 

2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందానికి అనుమతించారని భాజపా నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. మరోవైపు ఈ కుంభకోణంలో చిదంబరం తనయుడు కార్తీ ఓ విదేశీ కంపెనీ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరిపైనా సీబీఐ దృష్టి పెట్టింది.

ఈ దాడులను రాజకీయ కక్షసాధింపు చర్యలని కాంగ్రెస్ ఆరోపించింది. తీవ్రమైన ఆరోపణలు ఉంటె మూడేళ్ళుగా ఏమి చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి టామ్ వాడక్కన్ ప్రశ్నించారు. సాక్ష్యం ఉంటె నిరూపించాలని, అట్లా కాకుండా కాంగ్రెస్ నాయకుల ప్రతిష్టను దిగజార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారని అంటూ ప్రభుత్వం చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. 

Related News