//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లాలూ నివాసాలపై సీబీఐ దాడులు

Category : national

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తీవ్రంగా గళం విప్పుతున్న బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ , ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అవినీతి ఆరోపణ అస్త్రాలతో దాడులు జరపడం తీవ్రం అవుతున్నది. తాజాగా శుక్రవారం ఉదయం నుంచీ సీబీఐ దాడులు జరిపి తనిఖీలు నిర్వహిస్తోంది. 

ఢిల్లీ, పట్నా, రాంచీ, పూరి, గుర్గాన్ లతో సహా 12 ప్రాంతాల్లో గల నివాసాలలో సీబీఐ తనిఖీలు చేపట్టింది. 2006లో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో  ఓ ప్రైవేట్‌ సంస్థకు టెండర్ల కేటాయింపులో జరిగిన అవకతకవలపై లాలూ సహా ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజశ్వి యాదవ్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

రాంచి, పూరి లలో ప్రైవేట్ యాజమాన్యాల నుండి ఐఆర్ సిటిసి స్వాధీనం చేస్తుకున్న వారసత్వ  హోటల్ లను అభివృద్ధి, నిర్వహణల కోసం సుజాత హోటల్స్ అనే ప్రైవేట్ కంపెనీ ఒక దానికి టెండర్లు ఖాయ పరచడంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇతరులతో పాటు ఐఆర్ సిటిసి అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ పి కె గోల్, లాలూ కు నమ్మకస్తుడైన ప్రేమ్ చాంద్ గుప్తా భార్య సుజాత, ప్రైవేట్ కంపెనీ కి చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.