//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ నేత సుజనాచౌదరికి సీబీఐ నోటీసులు...

Category : state politics

టీడీపీ సీనియర్ నేత సుజనాచౌదరికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 26, 2019 బెంగళూరు సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బ్యాంక్ ల నుంచి రుణాలు పొంది మోసం చేశారనే ఆరోపణలు సుజనాపై ఉన్నాయి. 2017లో సుజనా చౌదరిపై నమోదైన కేసులో విచారణ జరుగుతోంది. సుజనా చౌదరి బ్యాంక్ ల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో బ్యాంకు అధికారులు గతంలో సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో సీబీఐ అధికారులు కేసును ఈడీకి బదిలీ చేశారు. ఈడీ సోదాలు నిర్వహించింది. సుజనా నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు. తప్పుడు సెల్ కంపెనీలు సృష్టించి బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఎగ్గొట్టారనే కేసులో భాగంగానే గతంలో బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు సీబీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది.

ఈడీ అధికారులు కూడా సుజనా చౌదరికి సంబంధించిన సెల్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అనేక కీలక ఆధారాలు కూడా సేకరించారు. బ్యాంకుల నుండి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టారని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి సీబీఐ అధికారులు సుజనాకు నోటీసులు ఇచ్చారు. మరోసారి నేరుగా బెంగళూరు సీబీఐ కార్యాలయం ఎదుట హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరైన తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటారో వేచి చూడాలి మరి.