//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వారి రాజసానికి ప్రతీక.. ‘పిల్లి’!

Category : national

మన దేశంలో పిల్లి ఎదురొచ్చిందంటే అపశకునంగా భావిస్తారు. కాసేపు ఆగి ప్రయాణాలు మొదలెడతారు. అదే విదేశాల్లో అయితే పిల్లుల్ని పెంచుకుంటారు. కానీ.. ఈజిప్టు ప్రజలు మాత్రం పిల్లిని దైవంలా కొలుస్తారట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ప్రాచీన కాలంలో పిల్లిని రాజసానికి ప్రతీకగా.. అత్యంత పవిత్రంగా చూసుకునేవారట.

ప్రాచీన కాలం నుంచి ఈజిప్టు ప్రజలు మూగజీవులను ఎక్కువగా పూజించేవారు. అందులో పిల్లిని అత్యంత పవిత్రంగా చూసేవారు. ఎవరి ఇంట్లో అయితే పిల్లి ఉంటుందో వారికి అదృష్టం కలిసివస్తుందని బలంగా నమ్మేవారు. అంతేకాదు.. ధనవంతులు పిల్లులను ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి బయటకు తీసుకెళ్లేవారట. అవి అలా ఆభరణాలు ధరించి నడుస్తుంటే.. రాజసానికి ప్రతీకగా కనిపించేవట. ఒకవేళ పిల్లులు మరణిస్తే ఇంట్లో కుటుంబసభ్యులు మరణించినట్లుగా బాధపడేవారట. పిల్లి మరణిస్తే దాని యజమానులు కనుబొమ్మలు తొలగించుకునే సంప్రదాయం అప్పట్లో ఉండేది. ఆ కాలంలో పిల్లులను ప్రత్యేకంగా చూసేవారు కాబట్టే అప్పటి వస్తువులు.. పెయింటిగ్స్‌లో వీటికి ప్రత్యేక స్థానం కల్పించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఎవరైనా పిల్లిని హత్యచేసినా.. అనుకోని ప్రమాదంలో దాని మరణానికి కారణమైనా వారికి మరణశిక్ష విధించేవారట. వాటి కోసం ఆలయాలు కూడా నిర్మించేవారట.