//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెన్నై లో చికెన్ బిర్యానీ......తిన్నారంటే అంతే.....!

Category : national

చెన్నైలోని పిల్లుల మిస్సింగ్ కేసును ద‌ర్యాఫ్తు చేస్తున్న పోలీసులు సంచ‌ల‌న విష‌యాన్ని వెలుగులోకి తెచ్చారు. రోడ్డు ప‌క్క‌న బ‌ళ్ల‌పై అమ్ముతున్న చికెన్ బిర్యానీలో పిల్లుల మాంసం క‌లుపుతున్న‌ట్టు గుర్తించారు. ఈ విష‌యం సంచ‌ల‌నంగా మారింది. చెన్నైలోని ప‌లు ప్రాంతాల నుంచి పోలీసుల‌కు ఇటీవ‌ల ఒకే రక‌మైన ఫిర్యాదులు వ‌చ్చాయి.

రెండు, మూడు రోజులుగా త‌మ పెంపుడు పిల్లి క‌నిపించ‌డం లేద‌ని చెన్నైలోని అవ‌డి, ప‌ల్ల‌వ‌రం, పూమ్‌పుజుల్ న‌గ‌ర్‌, తిరుముల్లాయ్‌వోయ‌ల్‌, క‌న్నికాపుర‌మ్ వంటి ప్రాంతాల్లోని వ్య‌క్తులు పోలీసుల‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ‌వ‌డంతో జంతు సంర‌క్ష‌ణ స‌మితి రంగంలోకి దిగింది. పోలీసుల‌పై ఒత్తిడి తెచ్చింది.

ఈ ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసుల‌కు ఓ సంచ‌లన విష‌యం తెలిసింది. ఈ పిల్లుల‌న్నీ రోడ్డు ప‌క్క‌న బిర్యానీ తినేవారి ప్లేట్‌ల‌లో చికెన్‌గా మారుతున్నాయ‌ని పోలీసులు క‌నిపెట్టారు. చికెన్ బిర్యానీ పేరుతో పిల్లి మాంసం అమ్ముతున్నార‌ని తేలింది. అందుకోసం ప‌లు ప్రాంతాల నుంచి పిల్లుల‌ను దొంగిలిస్తున్నారని క‌నిపెట్టారు. పిల్లుల‌ను ట్రాప్ చేసి ప‌ట్టుకుని వాటిని జీప్‌ల్లో త‌ర‌లిస్తున్న‌ట్టు తెలుసుకున్న పోలీసులు ప‌న్నెండు పిల్లుల‌ను ర‌క్షించారు. ఈ కేసును సిటీ పోలీస్‌కు చెందిన ఇంటిలిజెన్స్ వింగ్ ప‌రిశోధిస్తోంది.