//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావుపై కేసు న‌మోదు

Category : politics

మాజీ హోం శాఖ మంత్రి, ప్రస్తుత వైసీపీ నాయకుడు వసంత నాగేశ్వరరావుపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. తనకు ఫోన్‌ చేసి బెదిరించారని గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి వెంకటనరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయన పై కేసు నమోదు చేశారు.

గ్రామంలో ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఈ నెల 7న సాయంత్రం విధుల్లో ఉన్న తనకు నాగేశ్వరరావు ఫోన్‌ చేసి టీడీపీ ఏజెంటుగా పనిచేస్తున్నావంటూ బెదిరించారని పంచాయతీ కార్యదర్శి ఆరోపించారు. మీ మంత్రిని ఏమైనా చేస్తామని నాగేశ్వరరావు మాట్లాడారని కార్యదర్శి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.