//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేన నాయకుడి పై కేసు !

Category : politics

జనసేన నాయకులు గోపాళం రామస్వామి, లక్ష్మీకళ దంపతులపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు పట్టణ సీఐ కె.వినయ్‌కుమార్‌ తెలిపారు. గురువారం సిఐ విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు.

గోపాళం రామస్వామి, లక్ష్మీకళ దంపతులు తమ ఇంటికొచ్చి దౌర్జన్యం చేశారని అదే జనసేన పార్టీకి చెందిన మరో నాయకుడు పూల రామకోటేశ్వరరావు పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని చెప్పారు. ఈ ఫిర్యాదును విచారించి రామస్వామి దంపతులపై కేసు నమోదు చేసినట్లు అయన తెలిపారు.