//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ... పుట్టా మధు దంపతులపై కేసు నమోదు

Category : politics

నెల రోజుల టెన్షన్ కి తెరపడనుంది. ఇప్పుడు మరో కొత్త టెన్షన్ నేతలకు పట్టుకుంది. తాము చేసిన ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుంది అన్నది ఇప్పుడు నేతల ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఓటర్లను ఆకట్టుకునే అన్ని ప్రయత్నాలు చేసి మద్యం, నగదు పంపిణీ తో ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు ఇచ్చే తీర్పు మాత్రం ఆ సమయంలో వారి మైండ్ లో ఏం వుంటే అలాగే వుంటుంది. కాబట్టి ఇంతా చేసినా నాయకులకు ఓటరు నాడి తెలీదు. దీంతో టెన్షన్ 11 వ తేదీన ఫలితాలు వచ్చే వరకు కొనసాగే అవకాశం వుంది.

ఇవ్వాళా పోలింగ్ జరుగుతున్న నేపధ్యంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించటం లేదని బాహాబాహీకి దిగుతున్నారు పార్టీల నాయకులు . ఇక ఈ రోజు ఏకంగా అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల్లోకి పార్టీ కందవాలు వేసుకుని వస్తున్నారు. తాజాగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువా కప్పుకుని వచ్చారని ఆరోపణలపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, ఆయన భార్య శైలజ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

అయితే ఈరోజు జరుగుతున్న పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకోడానికి మధు తన భార్యతో కలిసి వెళ్లారు. అయితే వీరిద్దరు టీఆర్ఎస్ కండువా కప్పుకుని పోలింగ్ బూత్ లోకి వెళ్ళారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్దం అని భావించిన ఈసీ వీరిపై సీరియస్ గా నిర్ణయం తీసుకుంది. దీంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Related News