ఆటోమొబైల్ సెక్టార్లో లేటెస్ట్ ట్రెండ్ ఫ్లయింగ్ కారు. రోడ్డుపై తిరగడంతో పాటు గాల్లో ఎగరడం దీని స్పెషల్ ఎట్రాక్షన్. మొనాకోలో జరిగిన ఆటో షోలో ఈ కారును ఆవిష్కరించింది ఏరోమొబిల్ కంపెనీ. స్లోవాకియాకు చెందిన ఏరోమొబిల్ అనే ఆటోమొబైల్, ఫ్లయింగ్ కారును తీసుకు రానుంది. కేవలం మూడు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో కారు ఫ్లయింగ్ మోడ్‌లోకి వెళ్తుంది. ఇక రోడ్లుపై వెళ్తున్నప్పుడు కారు మాదిరిగానే ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. త్వరలో ఈ కారు ముందస్తు ఆర్డర్లు ప్రకటించనున్నట్లు ఆ సంస్థ, 2020 నాటికి కార్లను డెలివరీ చేస్తామని ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది. తొలుత 500 కార్లను ఉత్పత్తి చేయాలన్నది ఆ సంస్థ ఆలోచన. రేటు విషయానికొస్తే.. 1.29 మిలియన్ డాలర్ల నుంచి 1.61 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందట. అదే ఇండియన్ కరెన్సీలో చూస్తే రూ.8 కోట్లపైనే!