అంతరిక్ష పరిశోధన రంగంలోనే అరుదైన ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే.అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇప్పటి వరకు చేయనటువంటి ప్రయోగాన్ని ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ విజయవంతంగా చేసి చూపించింది.తొలిసారిగా అంతరిక్షంలోకి ఓ కారును పంపించింది.రోడ్‌స్టర్‌గా పిలుస్తున్న ఆ కారు వందకోట్ల సంవత్సరాల పాటు రోదసిలోనే ప్రయాణించనుంది.ఎరుపు రంగు టెస్లా స్పోర్ట్స్ కారును స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఒకప్పుడు వాడిందే.ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ఫాల్కన్ హెవీ ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపారు.
అయితే సెకనుకు 11 కిలోమీటర్ల వేగంతో 40 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్న రోడ్‌స్టర్ దారి తప్పిందట.నిజానికి అంగారక కక్ష్యలోకి రోడ్‌స్టర్ చేరడానికి కనీసం ఆరునెలలపైనే పడుతుంది.అయితే దారి తప్పిన రోడ్‌స్టర్ ఇంకా అంతరిక్షంలోపలకి వెళ్లడమే కాకుండా దాని దారి బెల్ట్ అస్టరాయిడ్ వైపుకు మళ్లింది.
కారులో ఉన్న ఇందనం ట్యాంకుల్లో ఒకటి పేలిపోవడం వల్ల దాని ద్రవ్యవేగం మారిపోయి ప్లాన్ రూట్లో కాకుండా మరో రూట్లో బెల్ట్ అస్టరాయిడ్ వైపుకు దూసుకెళ్తున్నట్లు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు.