భారత జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆటగాళ్ల జీతాల పెంపుదలకు సంబంధించిన రెండు కొత్త ప్రతిపాదనలు బీసీసీఐ, బోర్డు పాలకుల ముందు ఉంచాడు. ఆటగాళ్ల జీతాలను పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న కుంబ్లే, మిగతా ఆటగాళ్ల కంటే కెప్టెన్ కు ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని, అలాగే జట్టు సెలక్షన్ కమిటీలో చీఫ్ కోచ్ కి స్థానం కల్పించాలనే ఈ రెండు ప్రతిపాదనలు చేశాడు. జట్టు ఓటమికి, గెలుపులకు కెప్టెన్ జవాబుదారీ కావున అతడికి 25 శాతం ఎక్కువ జీతం చెలించాలన్నారు. ఆటగాళ్ల స్వభావం , వారి పిట్ నెస్ , ఫామ్ సంబంధించి విషయాలను కోచ్ దగ్గరినుండి గమనిస్తాడు కనుక జట్టు ఎంపికలో కోచ్ కి సముచిత స్థానం కల్పించాలని కుంబ్లే వాదించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.