//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పౌడర్‌తో కేన్సర్.. రూ. 31 వేల కోట్ల పరిహారం

Category : health

అందానికి మెరుగులు దిద్దే విషయంలో పౌడెర్డీ ప్రముఖ పాత్రా,అని మనకు తెలుసు.అలాంటి పౌడరతో కూడా ప్రమాదమే అంటున్నారు.బేబీ టాల్కమ్ పౌడర్ జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్లో ని ఆస్బెస్టాజ్‌ వల్లే తాము కేన్సర్‌ బారిన పడ్డామంటూ 22 మంది మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అది వినియోగదార్లను హెచ్చరించలేకపోయిందని పిటిషనర్ల తరుఫు లాయర్ న్యాయస్థానానికి తెలియజేశారు.

దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించడంతో వాటిని పరిశీలించిన కోర్టు వారి వాదనలతో ఏకీభవించింది. దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ.. మీరు బాధిత మహిళలకు మాత్రమే కాదు, ప్రపంచ తరఫున వాదించారు.. ప్రజల జీవితాలతో కంపెనీ ఆడుకోజాలదని వ్యాఖ్యానించింది. కేసు దాఖలు చేసిన 22 మంది మహిళల్లో ఆరుగురు కేన్సర్‌ కారణంగా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు..

ఇది దిగ్భ్రాంతి కలిగించేదే.. కానీ ఈ సంఘటనకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు సంబంధం లేదని ఆ సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. అయితే చిన్న పిల్లల పౌడర్‌, షవర్‌ టు షవర్‌ పౌడర్‌ తయారీలో వాడిన మినరల్‌ టాల్క్‌లో ఆస్బెస్టాజ్‌ ఉందని వైద్య నిపుణుల తమ నివేదికలో పేర్కొన్నారు. చాలా మంది మహిళల అండాశయ ప్రాంతంలో ఆస్బెస్టాజ్‌ అవశేషాలు, టాల్కమ్‌ పౌడర్‌ ఉన్నట్లు బాధితుల తరఫున న్యాయవాదులు విన్నవించారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టాల్కమ్‌ పౌడర్‌ వల్ల అండాశయ కేన్సర్‌ వస్తోందని గతంలో దాదాపు 9,000 మందికి పైగా మహిళలు కోర్టుల్లో పిల్ దాఖలు చేశారు.

అయితే కేన్సర్‌తో తమ ఉత్పత్తులను ముడిపెట్టడంపై కంపెనీ ఖండిస్తూ వచ్చింది. గతేడాది అక్టోబరు, నవంబరులో కాలిఫోర్నియాలోని ఓ న్యాయస్థానం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు అనుకూలంగా తీర్పులను ఇచ్చింది. అయితే తాజా తీర్పుతో జాన్సన్ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా తమ సంస్థ అత్యున్నత ప్రమాణాలను కాపాడుకుంటూ వస్తోంది... మా ఉత్పత్తుల్లో ఎలాంటి ఆస్బెస్టాజ్‌ అవశేషాలు లేవు. ఉత్పత్తులన్నీ సురక్షితమైనవేని అన్నారు. సహేతుక రీతిలో ప్రక్రియ జరగకపోవడంతో ఈ తీర్పు వెలువడిందని, మిస్సోరిలో దావా వేసిన మహిళలల్లో చాలా వరకు ఆ రాష్ట్రంలో నివసించడం లేదని, న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు.పౌడర్ ప్రేమికులారా కాస్త వాడకాన్ని తగ్గించండి..క్యాన్సర్ నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోండి..