Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తిరుమలలో విఐపి దర్శనాలు రద్దు

Category : editorial

తిరుమలలో త్వరలో వీఐపిలకు ఇస్తున్న ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను రద్దు చేస్తామని టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సామన్యులకు ఇబ్బంది లేకుండా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపిలు సైతం ఏడాదిలో ఒకసారే శ్రీవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. టిటిడి పాలకమండలి సభ్యులను 10 రోజుల్లో సియం నియమిస్తారని వెల్లడించారు. విఐపీలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శనానికి రావాలని ఆయన సూచించారు.

వీఐపీలు పదేపదే దర్శనాలకు వస్తే.. సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. పది రోజుల్లో పాలకమండలి సభ్యులను సీఎం నియమిస్తారన్నారు. శ్రీవారి సేవకు వచ్చి దురదృష్టవశాత్తూ చనిపోతే టీటీడీ తరపున ఆర్థిక సహాయం ఇవ్వాలన్నదానిపై చర్చిస్తున్నామన్నారు. తిరుపతిలోని బర్డ్స్‌ ఆస్పత్రిని దేశంలోనే నెంబర్‌ వన్‌ ఆసుపత్రిగా నిలుపుతామన్నారు.. బర్డ్స్‌లో వైద్య సేవల పనితీరు తెలుసుకునేందుకు ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో కలిసి.. ఆకస్మిక తనిఖీలు చేశారు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.