//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సుప్రీం జడ్జీలకు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్‌ కర్ణన్‌ జైలు శిక్ష

Category : national

భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే సంచలనం రేగింది. చీఫ్‌ జస్టిస్‌తో సహా ఏడుగురు జడ్జిలకు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ ఐదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఓ దళిత జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకుగాను, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌కు ఐదేళ్ల కఠిన కారాగారశిక్షతోపాటు ఒక లక్ష రూపాయల జరిమానా విధించారు. సీజేఐతోపాటు మరో ఏడుగురికి ఐదేళ్ల శిక్ష విధిస్తున్నట్టు కర్ణన్‌ తెలిపారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలలపాటు శిక్షను పొడిగించాలని ఆదేశించారు. కులవివక్ష చూపిన జడ్జిలందరికీ ఆయా పదవుల్లో కొనసాగే అర్హత లేద న్నారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జిలపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్‌ కర్ణన్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 17న కోర్టు ధిక్కార నేరం కింద బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. అనంతరం గత వారం ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, న్యాయ సంబంధమైన విధులు నిర్వహించేందుకు కుదరదని సుప్రీంకోర్టు పేర్కొంది. వైద్యుల సమక్షంలో ఆయనకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే పరీక్షలు చేయించుకునేందుకు కర్ణన్‌ తిరస్కరించారు. కొంతకాలంగా కోల్‌కతా హైకోర్టు జడ్జి కర్ణన్‌కు, సుప్రీంకోర్టు జడ్జిలకు మధ్య వివాదం చెలరేగుతోంది. తోటి హైకోర్టు జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ప్ర ధాన న్యాయమూర్తి జస్టిక్‌ ఖేహర్‌ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బెంచ్‌ కర్ణన్‌ను విచారించింది. అనంతరం జడ్జిలతో కూడిన బెంచ్‌ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్‌ ఆరోపించారు. తన కేసును సుమోటోగా తీసుకొని న్యాయపరమైన చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.