ప్రముఖ చాక్లెట్ల విక్రయ సంస్థ చాకోలియాస్ విస్తరణ బాట పట్టింది. వచ్చే మూడేండ్లకాలంలో(2020 నాటికి) దేశవ్యాప్తంగా మరో 265 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఎండీ చైతన్య కుమార్ తెలిపారు. వ్యాపారాన్ని ప్రారంభించి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం దేశవ్యాప్తంగా 235 అవుట్లెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 2020 నాటికి ఈ సంఖ్యను 500కి పెంచాలనుకుంటున్నట్లు చెప్పారు.
నూతనంగా ఏర్పాటు చేయనున్న రిటైల్ అవుట్లెట్లలో హైదరాబాద్‌లోనే 50 స్టోర్లను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ప్రాంఛైజ్ పద్దతిన స్టోర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నది. వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి అవసరమైన నిధుల్లో వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.50-100 కోట్ల వరకు నిధులను సేకరించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు