//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్యూ4లో 0.6 శాతానికి క్యాడ్

Category : business

గడిచిన ఆర్థిక సంవత్సరంలో(2016-17) నాలుగో త్రైమాసికానికి (క్యూ4) కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 340 కోట్ల డాలర్లకు పెరిగింది. ఈ విలువ స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 0.6%కి సమానం. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో(2015-16) నాలుగో త్రైమాసికానికి క్యాడ్ 30 కోట్ల డాలర్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన లోటు భారీగా పెరిగినప్పటికీ, మూడో త్రైమాసికంలో (క్యూ3) నమోదైన 800 కోట్ల డాలర్లతో పోలిస్తే మాత్రం గణనీయంగా తగ్గింది.

2016-17 ఆర్థిక సంవత్సరం మొత్తానికి క్యాడ్.. జీడీపీలో 0.7%గా నమోదైంది. 2015-16లో 1.1%గా ఉంది. విదేశీ కరెన్సీ రూపంలో వచ్చే ఆదాయం కంటే చెల్లింపులు అధికంగా ఉండటాన్ని కరెంట్ ఖాతా లోటుగా పరిగణిస్తారు. నాలుగో త్రైమాసికంలో వాణిజ్య లోటు (ఎగుమతి ఆదాయం కంటే దిగుమతుల కోసం చెల్లింపులు అధికంగా ఉండటం) 2,970 కోట్ల డాలర్లకు చేరుకోవడం వార్షిక ప్రాతిపదికన క్యాడ్ పెరుగుదలకు ప్రధాన కారణమైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (బీవోపీ) 2,160 కోట్ల డాలర్లుగా నమోదుకాగా.. నాలుగో త్రైమాసికానికి 731 కోట్ల డాలర్లుగా ఉంది.