//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెలబ్రిటీ కడుపులు కొడుతున్న మోడీ కొత్త నిర్ణయం

Category : national

సంచలన నిర్ణయాలు తీసుకోవటంలో ప్రధాని మోడీ తర్వాతే ఎవరైనా. ఊహించనిరీతిలో నిర్ణయాలు తీసుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. ప్రధానిగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అందరి నోట వినిపించే మాట.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని అయినా మోడీ తీసుకోగలరనే. ఈసారి మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం సామాన్యులకు కాకుండా సెలబ్రిటీలకు షాక్ తగిలేలా ఉండటం విశేషం.

ప్రముఖులతో వాణిజ్య ప్రకటనలు రూపొందించి వినియోగదారులను ఇకపై తప్పుదోవ పట్టించడం కుదరదు. ప్రజలను మభ్యపెట్టే ప్రకటనల్లో ప్రముఖులు నటించడంపై కేంద్రం నిషేధం విధించనుంది. ఈ మేరకు సవరణలతో రూపొందించిన నూతన వినియోగదారుల సంరక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ బిల్లు ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించడంపై నిషేధంతో పాటు వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థ(సీసీపీఏ)ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే జౌళి, అనుబంధ రంగాల్లో నూతన నైపుణ్యాభివృద్ధి పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌ పలు నిర్ణయాలు తీసుకుంది.

వినియోగదారుల సంరక్షణ బిల్లు-1986 స్థానంలో 2015 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పార్లమెంటు స్థాయీ సంఘం సిఫారసుల అనంతరం నూతన బిల్లు-2017ను కేబినెట్‌ ఆమోదించింది. జౌళి రంగంలో నైపుణ్యాల అభివృద్ధికి రూ.1300కోట్లతో చేపట్టనున్న కొత్త పథకానికి కూడా ఆమోదం తెలిపింది.