//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముసాయిదా GST బిల్లులను ఆమోదించిన కేంద్ర మంత్రి వర్గం

Category : business

ముఖ్యమైన నాలుగు GST ముసాయిదా బిల్లులకు నేడు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అక్కడ కూడా ఆమోదింపచేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నాలుగు డ్రాఫ్ట్ జీఎస్టీ బిల్లులు : కంపెన్సషన్ లా, సెంట్రల్ జీఎస్టీ , ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, యూనియన్ టెరిటరీ జీఎస్టీ. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో GST బిల్లుల ఆమోదమే ముఖ్య ఎజెండా. ఈ నాలుగు బిల్లులను పార్లమెంట్ లో ఆమోదం పొందనున్నట్లు సమాచారం.ఐదవ బిల్లు అయినా స్టేట్ GST ని అన్ని రాష్ట్రాల శాశనసభలలో ప్రవేశపెట్టి చర్చించిన అనంతరం ఆమోదం పొందవలసి ఉంటుంది. అందరి ఆమోదం పొందిన తర్వాత జులై 1 నుంచి జీఎస్టీ బిల్లులను అమలులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన వస్తు సేవలు టాక్స్ శ్లాబులను అమలు చేయటానికి ఈ బిల్లులు ఉపయోగపడతాయి.