అండర్-19 ఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ప్రపంచకప్‌ను ఎగరేసుకొచ్చిన భారత జట్టుకు నజరానాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
టైటిల్ గెలిచిన వెంటనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షల నజరానా ప్రకటించింది. ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్ పృథ్వీషాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంసీఏ రూ.25 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఎంసీఏ అధ్యక్షుడు ఆశిష్ ట్వీట్ చేశారు.
అండర్-19 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన పృథ్వీషా సేన ఆస్ట్రేలియాను చిత్తుచిత్తుగా ఓడించి నాలుగోసారి ప్రపంచకప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించింది.
కాగా ముంబైకి చెందిన పృథ్వీ షాకు ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు బహుమానం ప్రకటించడంతో ఇతర బోర్డులు కూడా తమ ప్లేయర్లకు నజరానా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక, ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ పృథ్వీ షాను రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేసింది.