//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నన్ను భయపెట్టడానికి దయ్యాల్ని పంపారు.. నేను వెళ్ళిపోతా..!

Category : politics

మనుషుల్ని భయపెట్టడానికి మందితోనో,ఆయుధాలతోనో బెదిరింపులకు పాల్పడతారు అని అందరికి తెలిసిందే.కానీ ఇక్కడ దయ్యాలని పంపారట.ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడి కామెంట్లతో అంతా షాకవుతున్నారు.తాను ఉంటున్న బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని తేజ్ ప్రతాప్ యాదవ్ చెబుతున్నారు.వివరాల్లోకి వెళ్తే,

బీహార్ సీఎ నితీష్,డిప్యూటీ సీఎం సుశీల్ మోదీలు తాను ఉంటున్న బంగ్లాలో దెయ్యాలను వదిలారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు.తనతో ఖాళీ చేయించేందుకు ఇలా చేశారని మండిపడ్డారు.అందుకే ఆ భవనాన్ని తాను ఖాళీ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.తేజ్ ప్రతాప్ గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో పాట్నాలోని దేశ్ రత్నా మార్గ్‌లో ఈ భవనాన్ని ప్రభుత్వం కేటాయించింది.అప్పటి నుంచి అదే బంగ్లాలో ఉంటున్నారు.

బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక,ఈ భవనాన్ని ఖాళీ చేయాలని తేజ్ ప్రతాప్‌ను అధికారులు కోరారు.ఈ విషయం వివాదంగా మారి పంచాయితీ హైకోర్టు వరకు వెళ్లింది.కొంతమంది ఆర్జేడీ నేతలు పిటిషన్ వేశారు.ప్రభుత్వం నుంచి బయటికొచ్చాక ఈ బిల్డింగ్‌ను కార్యకర్తల సమావేశానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు.గతంలోనూ ఈ బంగ్లాకు వాస్తు దోషం ఉందని ఆయన‌ ఆరోపించారు.దాంతో ప్రధాన ద్వారాన్ని మూసివేసి వెనక ద్వారాన్ని వినియోగించారు.

తేజ్ ప్రతాప్ మాత్రం తన తల్లికి కేటాయించిన బంగ్లాలో ఉంటున్నారు.అయితే ఇప్పుడు సడన్‌గా ఈ భవనం విషయమై ఆయన స్పందించి దెయ్యాలున్నాయని ఖాళీ చేస్తున్నానని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.మరోవైపు తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై జేడీయూ నేతలు మండిపడుతున్నారు.ప్రచారం కోసమే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Related News