Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మృతదేహాన్ని 70 కిలోమీటర్లు లాకెళ్లిన బస్సు ..!

Category : national

ఈ మధ్య కాలంలో రోడ్ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.ఐతే ఇంతవరకు మనం చూసిన రోడ్ ప్రమాదాలకు బిన్నంగా ఈ ఘటన జరిగింది.వివరాలలోకి వెళ్తే,

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ కు చెందిన ఓ ఆర్టీసీ బస్సు ఓ మనిషి ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా, మృత దేహాన్ని 70 కిలోమీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో బెంగళూరు శాంతినగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ మోహినుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నాన్ ఏసీ స్లీపర్ బస్సు తమిళనాడులోని కూనూరు నుంచి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మైసూరు, మాండ్య, చెన్నపట్న మార్గంలో బెంగళూరుకు వెళుతోంది. బెంగళూరుకు చెన్నపట్న 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బస్సు ఓ రాయిని ఢీకొన్నట్టు డ్రైవర్ గుర్తించాడు. అద్దంలోంచి చూడగా వెనుక ఏమీ కనిపించలేదు. దాంతో బస్సును ఆపకుండా అలానే ముందుకు పోనించాడు.

తెల్లవారుజామున 3 గంటల సమంయలో బస్సు బెంగళూరులోని మైసూర్ శాటిలైట్ బస్ స్టేషన్ కు చేరుకుంది. ఆ తర్వాత మేజిస్టిక్ సెంటర్ కు అక్కడి నుంచి శాంతినగర్ డిపోకు చేరింది. డ్రైవర్ బస్సును పార్క్ చేసి వెళ్లిపోయాడు. ఉదయం 8 గంటల సమయంలో బస్సును శుభ్రం చేస్తున్న సమయంలో సిబ్బంది బస్సు కింది భాగంలో మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. ఈ సమాచారం పోలీసులకు అందించడంతో వారు డ్రైవర్ మోహినుద్దీన్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని 100, 200 మీటర్లు లాక్కెళ్లిన ఘటనల గురించి విన్నాం గానీ, ఈ తరహా ప్రమాదం గురించి మొదటి సారి వింటున్నామని ఆర్టీసీ అధికారులే చెప్పడం గమనార్హం. మృతుడ్ని ఇంకా గుర్తించాల్సి ఉంది.

Related News