//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం : వంతెన మీద నుండి నదిలోకి దూసుకెళ్లిన బస్సు

Category : national

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 27 మంది దుర్మరణం చెందగా. మరో ఐదుగురు గాయపడ్డారు. సవాయ్‌ మధోపూర్‌లోని దుబి వద్ద శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన కొంతమంది ప్రయాణికులు రాజస్థాన్‌లోని రామ్‌దేవ్రా ప్రాంతానికి ప్రైవేట్‌ బస్సులో వెళ్తున్నారు. సవాయ్‌ మధోపూర్‌లోని దుబి వద్ద బనస్‌ నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

స్థానికుల సాయంతో బస్సును ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి వంతెన గోడను ఢీకొట్టడంతో బస్సు నదిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు.