//single page style gallary page

Bunny in the regular shoot after the holiday trip ...... Stylish star that appears in full recharge.

Category : movies

Click here to read this article in Telugu

హాలీడే ట్రిప్ తరువాత రెగ్యులర్ షూట్ లో బన్నీ......ఫుల్ రీ ఛార్జ్ లో కనిపిస్తున్న స్టైలిష్ స్టార్.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న సినిమా ఇది బన్నీ కి 19వ మూవీ కాగా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక కొంత గ్యాప్ తీసుకుంది ఈ చిత్ర యూనిట్.ఈ షార్ట్ గ్యాప్ లో బన్నీ తన ఫ్యామిలీతో పాటు విదేశాల్లో హాలిడే ట్రిప్ కి వెళ్లి తెగ ఎంజాయ్ చేసి వచ్చారు. ఇవాళ్టి నుంచి రెండో షెడ్యూల్ లో బన్నీ జాయిన్ అయ్యాడు. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన గీతా ఆర్ట్స్ తో పాటు హారికా హాసినిలు సంస్థలు ఈ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సమయంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ మరింత లేట్ అవుతుంది అనే అభిప్రాయాలు మొదలయ్యాయి.అందుకు కూడా కారణాలు లేక పోలేదు.

ఈ సినిమా స్క్రిప్ట్ ని మరింత రిపేర్ చేసే పనిలో పడ్డారనే పుకార్లకు ఇక ఈ పోస్టర్స్ తో చెక్ పడినట్టే అర్థం అవుతుంది. ఇక పై షూటింగ్ కూడా సుదీర్ఘంగా జరగబోతున్నట్టు తెలిసింది.ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేతో పాటు మరో కీలక నటి నటులు కూడా ఈ షెడ్యూలు లో పాల్గొన బోతున్నారు. ఇక మొత్తం షూట్ హైదరాబాద్ లోనే జరగనున్న ఆ తరువాత... షూట్ కోసం నెక్స్ట్ షెడ్యూలు ఎక్కడ ప్లాన్ చేశారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏడాది గ్యాప్ తర్వాత బన్నీ చేస్తున్న మూవీ కావడంతో అభిమానులకు దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. దానికి తోడు హీరో దర్శకుడి కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ.

జులాయి-సన్ అఫ్ సత్యమూర్తి సిరీస్ లో వస్తోంది కాబట్టి ఇది వాటికి మించాలనే లెక్కతో ఎదురు చూస్తున్నారు. సీనియర్ నటి టబు మలయాళం యాక్టర్ జయరాం బన్నీ తల్లితండ్రులుగా నటిస్తున్న ఈ మూవీలో సెంటిమెంట్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు సరైన మోతాదు లో యాక్షన్ కూడా ఉంటుందట. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు అలకానంద, నేను నాన్న అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి కానీ.చూడాలి మరి ఏ టైటిల్ ఫైనల్ అవుతుంది అనేది.అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ నవంబర్ లోపే షూటింగ్ మొత్తం పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు త్రివిక్రమ్. ఇదయ్యాకే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళే అవకాశం ఉంద నీ సమాచారం.

Stylish Star Allu Arjun is the heroine of Trivikram Srinivas combo, which is the 19th film of Bunny and the film is already a gap after the first schedule. Bunny in this short gap traveled to a holiday trip abroad and enjoyed the tribe. Bunny was born in the second schedule of this year. In addition to the prominent production companies Geeta Arts, the Harika hashini firms officially announced the movie poster through social media. It was at this time that the release of the film started to be more late.

The rumors that this movie is being done to repair the script is meant to be checked with these posters. Pooja Hegde and another key actress are also going to participate in this schedule. After that, the entire shoot will be held in Hyderabad and then the next schedule for the shoot is yet to be known. Fans have a lot of expectations since it's a bunny doing the movie after a year gap. In addition, this is a hat trick movie combo of comedy hero.

The Zulai-Son of Satyam Murthy is coming up in the series so it is waiting to be counted. Senior actress Tubu Malayalam actor Jayaram Bunny is playing the role of the movie, with a sentimental entertaining in the right dose. Taman's music is that the film is going to be titled Alaknanda and I Nanna. But it is going to be a title final. But the film is in the plan to release it next year. Trivikram is in the planning to complete the shooting in November. Idyankay Venu Sriram is the direction of the icon of the regular shooting of your information.